2.0 Telugu Movie Review

                            విజువల్ వండర్

సినిమా :- 2.0 

నటీనటులు :- రజినీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్, సుధాన్షు పాండే, ఆడల్ హుస్సేన్, కలాభావన్ షజోన్, రియాజ్ ఖాన్, కైజాడ్ కోట్వాల్, మయూర్, బన్స్వాల్ తదితరులు.

దర్శకత్వం :- శంకర్.

నిర్మాణం :- కె. కరుణామూర్తి, ఎ. సుబస్కరన్, గౌరవ్ మిశ్రా.

సంగీతం :- A.R రెహమాన్.

సినిమాటోగ్రఫీ :- నిరవ్ షా.

ఎడిటర్ :- ఆంథోనీ.

 అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 2.0 సినిమా రానే వచ్చేసింది. డైరెక్టర్ శంకర్- సూపర్ స్టార్ రజినీకాంత్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన 2.0.సినిమా భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10,500 స్క్రీన్స్ లో రిలీజ్ అయింది. 3D టెక్నాలజీ తో వచ్చిన ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే కొన్ని రికార్డ్ లను క్రియేట్ చేసింది. అయితే ఇన్ని విశేషాలతో రూపొందిన 2.0 సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది, మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఆడియన్స్ ని అలరించిందో ఇప్పుడు చూద్దాం….

కథ :-

  చెన్నైలో ఉన్నట్టు ఉండి సడెన్ గా ప్రజల సెల్ ఫోన్స్ గాలిలోకి వెళ్ళిపోయి మాయమవుతూ ఉంటాయి. అసలా ఫోన్స్ ఎలా మయమవుతున్నాయో ఎక్కడికి వెళ్తున్నాయో పోలీసులకు, ప్రజలకు ఏం అర్ధం కాదు. దాంతో ఆ ఫోన్స్ గురించి తెలుసుకోవడానికి సైంటిస్ట్ వశీకరన్ (రజినీ కాంత్ ) తన టెక్నాలజీని ఉపయోగించి.. చివరకి ఆ సెల్ ఫోన్స్ ను ఓ నెగిటివ్ ఫోర్స్ మాయం చేస్తుంది అని తెలుసుకుంటాడు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఆ సెల్ ఫోన్స్ అన్ని కలిసి ఒక పక్షి ఆకారంలో మారి అతి దారుణంగా కొంతమందిని చంపుతుంది. ఇక ఈ పరిస్థితిని అదుపు చేయడానికి తప్పని పరిస్థితుల కారణంగా సైంటిస్ట్ వశీకరన్ కి చిట్టి ని రీ లాంచ్ చెయ్యటానికి ప్రభుత్వం అనుమతి ఇస్తోంది. రీ లాంచ్ అయిన చిట్టి ఆ నెగిటివ్ ఫోర్స్ ని అంతం చెయ్యడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు ? చివరకి అంతం చేశాడా లేడా ? ఈ క్రమంలో చిట్టి 2.ఓ గా రీ లోడ్ ఎలా చెయ్యబడతాడు ? అసలు ఆ నెగిటివ్ ఫోర్స్ కు సెల్ ఫోన్స్ కు ఉన్న సంబంధం ఏమిటి ? దీని వెనకాల ఉన్న కథ ఏమిటి ? చిట్టి 2.ఓ ఈ పరిస్థితి ని ఎలా అదుపులోకి తీసుకువస్తాడు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:-

 ఈ సినిమాలో హీరోగా నటించిన రజినీకాంత్ ఒకవైపు ప్రెఫెసర్ గా మరో వైపు రోబోగా ఇరగదీసాడు. ముఖ్యంగా చిట్టి పాత్రలో ఒక రోబో గా నసించి ఇజంగా రోబోనేనేమో అని అనిపించాడు, ఆ తర్వాత విలన్ పాత్రలు నటించిన అక్షయ్ కుమార్, తనలోని ప్రతి యాంగిల్ ని విలనిజాన్ని మార్చుకుని విలన్ గా త పాత్రను చించేసాడు. ఇక ముందుగా తన రూపంతోనే వివులనిజానికి ప్రాణం పోశాడు అక్షయ్ కుమార్. అయితే ఒక వేరియేషన్ ధ్వారా తాను ఎలా విలన్ గా మారాడు. దానితో సమాజానికి ఎలా మెసేజ్ ఇచ్చాడు వంటి విషయాల్లో పూర్తిగా సక్సస్ అయ్యాడు అక్షయ్. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అమీ జాక్సన్ ఒక రోబో గా తృహన పాత్రలో ఒదిగిపోయింది. అలాగే తన గ్లామర్ తో కూడా కుర్రకారులను పరుగెత్తించింది ఈ హాలీవుడ్ బ్యూటీ. దానితో పాటు రోబో చిట్టి తో రొమాంటిక్ యాంగిల్ ని కూడా చూపించింది ఈ హాట్ బొమ్మ. ఇక మిగిలిన పాత్రల్లో నటించిన వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ పాత్రల్లో బాగానే నటించి అందరిని మెప్పించారు.

సాంకేతిక వర్గం :-

 రోబో సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా ను తెరకెక్కించగా డైరెక్టర్ శంకర్ మంచి స్టోరీ లైన్ ని తీసుకుని దాన్ని పూర్తిగా తెర మీద పెట్టాడు. ఇక శంకర్ ఐదేళ్ల కఠోర శ్రమ ఈవ్ సినిమాలో రెండు గంటల ఇరవై నిమిషాల్లో క్లియర్ గా కనిపిస్తుంది. తర్వాత ఈ సినిమాకు A.R రెహమాన్ అందించిన సంగీతం మనం అంచనాలకు తగ్గకుండానే ఉంది. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అందరికి గూజ్ బమ్స్ తెప్పిచాడు రెహమాన్. ఇక ఈ సినిమాలో VFX పనుల గురించి సెపరేట్ గా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఈ సినిమాలోని గ్రాఫిక్స్ ని చూస్తుంటే మనం వేరే ప్రపంచం లోకి వెళ్ళటం కాయం. ఆ తర్వాత ఏ సినిమాకు సినిమాటోగ్రఫి ని అందించిన నిరవ్ షా ప్రతి సీన్ ను అద్భుతంగా చిత్రీకరించాడు. ఇక సినిమాకు కావలసిన స్టఫ్ ని మాత్రమే తీసుకుని ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవ్వటాని ముఖ్య పాత్ర పోషించాడు ఎడిటర్ ఆంథోనీ. ఈ 2.0 సినిమా ఇంత గ్రాండ్ గా రావటానికి ముఖ్యమైన నిర్మాతలు ఈ విషయం లోను ఇంతకుడా కంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను నిర్మించారు.

విశ్లేషణ :-

 శంకర్- రజినీకాంత్ ల కాంబినేషన్ లో వచ్చిన 2.0 సినిమా ఎంత బాగుందంటే.. ఈ సినిమాలో చూపించటానికి కనీసం ఒక్క మైనస్ పెయింట్ కూడా లేదు. కొత్త కొత్త టెక్నాలజీలతో కొత్త అనుభూతిని పరిచయం చేస్తునే మరో వైపు సమాజానికి ఒక మంచి మెసెజ్ ని కూడా ఇస్తుంది ఈ సినిమా. గ్రాఫికల్ వండర్ గా కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసే ఈ సినిమా అందరి ఆడియన్స్ ని మెప్పించింది. అలాగే కొత్త రికార్డ్స్ వైపు పరుగుతీస్తుంది 2.0 మూవీ.

రేటింగ్ :- 4.5