అమర్ అక్బర్ ఆంటోని మూవీ రివ్యూ

అమర్ అక్బర్ ఆంటోని మూవీ రివ్యూ

సినిమా:- అమర్ అక్బర్ ఆంటోనీ

నటీనటులు:- రవి తేజ, ఇలియానా, సాయాజీ షిండే, అభిమన్యు సింగ్, ఆదిత్య మీనన్, విక్రమ్జీట్ విర్క్, సిజోయ్ వర్గీస్ తదితరులు.

దర్శకత్వం:- శ్రీను వైట్ల.

సంగీతం:- S.S థమన్.

నిర్మాత :-నవీన్ యెర్నిని, రవి శంకర్, మోహన్ చేకూరి.

సినిమాటోగ్రఫీ:- వెంకట్ దిలీప్ చుండూరు.

ఎడిటింగ్:- M.R. వర్మ.

మాస్ మహారాజ రవితేజ – శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా “అమర్ అక్బర్ ఆంటోని”. విల్లా కాంబినేషన్ లోవచ్చిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అవ్వటం తో, ఈ సినిమా హ్యాట్ ట్రిక్ కొడతారనే అంచనాలు ఉన్నాయి. అంతే కాకుండా ఈ సినిమా తో హీరోయిన్ ఇలియానా కూడా టాలీవుడ్ కి మల్లి ఎంట్రీ ఇవ్వబోతుంది. అయితే రవి తేజ ఫ్రాన్స్ తో పాటు మాస్ ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది కాగా ఈ సినిమా ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకనుందో ఇప్పుడు చూదాం…

కథ :-

రవితేజ (అమర్) మరియు ఇలియాన (ఐశ్వర్య) పెరెంట్స్‌ మంచి ఫ్రెండ్స్. న్యూయార్క్‌ లో కలిసి బిజినెస్ చేస్తుంటారు. తమ కంపెనీలో పని చేసే నలుగురు ఎంప్లాయిస్ (విలన్ )కి, తమ కంపెనీలో ట్వంటీ పర్సెంట్ షేర్ ఇచ్చి.. వాళ్ళని ఫ్యామిలీ మెంబర్స్ గా ట్రీట్ చేస్తారు. కానీ వాళ్లు అమర్ , ఐశ్వర్య పేరెంట్స్ ని చంపేస్తారు. అయితే వారి నుండి అమ‌ర్- ఐశ్వ‌ర్య‌లు మాత్రం త‌ప్పించుకుంటారు. ఆ తరువాత అమ‌ర్ ఆ నలుగురు పై ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు. ఈ క్ర‌మంలో అమర్ డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ తో బాధ పడుతూ ఉంటాడు. ఆ డిజార్డర్ వ్యాధితో స‌త‌మ‌త‌మ‌వుతున్నా.. ఆ నలుగురుని అమర్ ఎలా చంపుతాడు. చిన్న‌త‌నంలో దూరమయిన ఐశ్వ‌ర్య‌ను అమర్ మళ్ళీ ఎలా క‌లుసుకుంటాడు..? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాలసిందే.

నటీనటుల పనితీరు :-

మొదటి సారి మూడు పాత్రల్లో నటించిన రవి తేజ ఒక అద్భుతమైన నట ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆ మూడు పాత్రల్లో మునిగి నటించిన రవి తేజ, అలాగే ఇటు తన పాత్రలతో విపరీతంగా నవ్వించాడు. తన టైమింగ్ చివరి వరకు మెంటైన్ చేస్తూ…అదరహో అనిపించాడు. ఇక చాలా కాలం తర్వాత తెలుగు సినిమా పరిశ్రమకు తిరిగి వచ్చిన ఇలియానా తన పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ పాత్రలో చాలా కొత్తగా కనిపించిన ఇలియానా తన గ్లామర్ తో మరోసారి ఒక ఊపు ఊపింది. ఆ తర్వాత ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సునీల్ గురించి. తిరిగి కామెడీ లోకి అడుగు పెట్టిన సునీల్ త పాత టైమింగ్ తో చాలా బాగా నవ్వించాడు. ఇక వీరితో పాటు మిగిలిన వారు కూడా తమ తమ పాత్రలతో బాగానే అలరించారు.

సాంకేతిక వర్గం :-

ఈ సినిమాలో మంచి స్టోరీ లైన్ ఎంచుకున్న శ్రీను వైట్ల, దాన్ని అలాగే తెరకెక్కించాడు. ఈ సినిమాను సరదాగా ముందుకు నడిపించటం లో విజయం సాధించాడని చెప్పవచ్చు. ఇక సినిమాలో కామెడీ తో తన మార్క్ ని చూపించాడు. అలాగే, ఈ సినిమా లో స్క్రీన్ ప్లే చాలా గొప్పగా ఉంది. దానితో పాటు ఈ సినిమాలో వెంకట్ దిలీప్ చుండూరు అందించిన సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. తర్వాత S.S థమన్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. కొన్ని సీన్స్ లో అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఇరగదిశాడు థమన్. ఇక ఈ సినిమాలో నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాను నిర్మించారు నిర్మాతలు.

విశ్లేషణ:-

శ్రీను వైట్ల దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, ఇలియానా హీరోయిన్ గా వచ్చిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమా ఒక రివెంజ్ స్టోరీ. రివెంజ్ స్టోరీ అయినప్పటికీ ఒక డిఫెంట్ కథతో అమర్ అక్బర్ ఆంటోనీ వచ్చింది. అయితే ఇది అమర్ అక్బర్ మొక్క మూడు పాత్రల కథ. అయితే రవితేజ తన నటనతో సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. ఇలియాన నటన కూడా చాలా బాగుంది. ఇక సత్య , సునీల్ తమ కామెడీ టైమింగ్ తో బాగానే నవ్వించారు. యాక్షన్, కామెడీ మరియు మంచి ఎమోషన్ తో నడిచే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించే విధంగానే ఉంది.

రేటింగ్ :- 3.25