అరవింద సమేత రివ్యూ

అరవింద సమేత రివ్యూ

సినిమా: అరవింద సమేత
తారాగణం:ఎన్టీఆర్, పూజా హెగ్డే, సునీల్, జగపతిబాబు, నవీన్ చంద్ర, దేవయాని, సితార, వి. కె. నరేష్, ఈషా రెబ్బ, సుప్రియ పాటక్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు
సంగీతం: ఎస్. థమన్
సినిమాటోగ్రఫీ: పి. ఎస్. వింద
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాత : సూర్యదేవర చినబాబు
రచన, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం అరవింద సమేత. వీరిద్దరి కలయికలో వచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్ లతో తన మార్కు చూపించాడు ఎన్టీఆర్. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టైలిష్ లోక్ తో ఆకట్టుకున్నాడు. తొలిసారి రాయలసీమ యాసలో మాట్లాడి అభిమానులకు కొత్త ఎన్టీఆర్ ని పరిచయం చేయబోతున్నాడు దర్శకుడు త్రివిక్రమ్. ప్రతి మగాడి మార్పుకు ఒక స్త్రీ కారణం అనే కాన్సెప్టుతో వస్తున్న ఈ చిత్రం పై అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి భారీ అంచనాల నడుమ మధ్య విడుదలైన అరవింద సమేత వీర రాఘవ ఏ మేరకు ఆకాటుకున్నాడా లేదా?

 

కథ: 

కొముద్ది ఆ ఊరులో 30 ఏళ్లుగా ఫ్యాక్షనిజం తో కొట్టుకుంటారు. అక్కడి నుంచి కథ మొదలవుతుంది. ఆ ఊరు లో నరప్ప రెడ్డి (నాగబాబు)కి, బసిరెడ్డి (జగపతిబాబు) వర్గానికి కొముద్ది, నల్ల గుడికి మధ్య ఫ్యాక్షన్ గొడవలు ఉంటాయి. అదే సమయంలో హైదరాబాద్ నుంచి నరప్ప రెడ్డి కొడుకు వీర రాఘవ రెడ్డి (ఎన్టీఆర్) వస్తాడు. అప్పుడే ఆ ఊరులో ఎలక్షన్స్ హడావుడి మొదలవుతుంది. అపొజిషన్ లో బసిరెడ్డి నిలబడతాడు. తనకి ఎదురు నిలబడి ఎదురించేది నరప్ప రెడ్డి అని తెలుసుకుని తనని బరిలోకి దింపుతోంది అధికార పార్టీ. అలా మొదలైన ఈ గొడవలో బసిరెడ్డి, నరప్ప రెడ్డిని చంపుతారు. వీర రాఘవ రెడ్డి తన వల్ల ఆ ఊరికి ఎలాంటి గొడవలు జరగకుండా ఉండాలని.. ఊరి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు నీలాంబరి (సునీల్) తనకి షెల్టర్ ఇస్తాడు. ఒక చిన్న గొడవలో అరవింద (పూజ హెగ్డే) పరిచయం అవుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమ గా మారుతుంది. ఆ ప్రేమే తనను మార్చేసింది అని నమ్ముతాడు. మరి తన ప్రేమను సాధించుకున్నాడా… రాఘవని చంపేందుకు కాచుకు కూర్చున్న బసిరెడ్డి పగ తీర్చుకున్నాడా… లేక రాఘవ ప్రేమ తో మారుస్తాడా మరి రాఘవ చూపించిన ప్రేమ దారిలో నడుస్తాడా.. పగ ప్రతీకారం తో చంపాలనుకుంటాడా అనేది తెరపైనే చూడాలి.

 

నటీనటుల ప్రతిభ:

ఎన్టీఆర్ ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్. తన నటనతో మరోసారి తానేంటో నిరూపించుకున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో తనదైన ప్రతిభ కనబరిచారు. ఎమోషన్ సీన్స్ లో ఎన్టీఆర్ అద్భుతమైన నటన తో మెప్పించారు. తన రౌద్రమైన నటనతో రాయలసీమ భాషలో మాటలు తూటాల్లా పేల్చారు. ఎన్టీఆర్ కు పోటీ గా జగపతిబాబు పాత్ర కూడా అంతకుమించి ఉంది.. క్రూరమైన విలనిజంలో తనదైన ముద్ర వేసుకున్నారు. నవీన్ చంద్ర పాత్ర చిన్నదైనప్పటికి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పూజ హెగ్డే పాత్ర పాటలకు పరిమితమనే చెప్పాలి. కమెడియన్ గా తనదైన గుర్తింపు తెచ్చుకున్న సునీల్… హీరోగా టర్న్ అయి… కమెడియన్ గా యూ టర్న్ తీసుకున్న సునీల్ కామెడీ అంతగా పండలేదనే చెప్పాలి. వి. కె. నరేష్ కామెడీ పర్వాలేదనిపించింది. మిగతా పాత్రల్లో నాగబాబు, దేవయాని, ఈషా రెబ్బ, సుప్రియ పాటక్, ఈశ్వరి రావు, బ్రహ్మాజీ తమ పరిధి మేరకు నటించారు.

 

సాంకేతిక వర్గ పనితీరు:

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కిన చిత్రం అరవింద సమేత. త్రివిక్రమ్ మొదటి సినిమా నుంచి తన మాటలతో ప్రేక్షకులను మెప్పించాడు. సినిమా మొదలైన 20 నిమిషాలు ఎక్కడికో తీసుకెళ్లిన దర్శకుడు. ఆ తరువాత పస తగ్గించాడు. తనదైన ఎంటర్టైన్మెంట్ డైలాగ్ మార్క్ ఈ సినీమాలో చూపించలేకపోయాడు. మొదటి భాగం సాదా సీదా గా నడిపించిన… రెండో భాగం ఆసక్తి రేకెత్తించాడు. ఈ చిత్రానికి ముఖ్యంగా రామ్ లక్ష్మణ్ సమకూర్చిన యాక్షన్ సన్నివేశాలు హైలెట్ అనే చెప్పాలి. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది సంగీత దర్శకుడు థమన్ స్వరపరిచిన సంగీతంతోపాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ముఖ్యంగా ఈ సినిమాలో పెనిమిటి పాట ప్రధాన ఆకర్షణ అనే చెప్పాలి. నవీన్ నూలి ఎడిటింగ్ పర్వాలేదు.. పి. ఎస్. వింద సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. హారిక హాసిని నిర్మాణ విలువలు బాగున్నాయి.

విశ్లేషణ:

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫ్యాక్షనిజం కథతో తెరకెక్కించిన అరవింద సమేత వీర రాఘవ సినిమా స్టార్టింగ్ ఫైట్ ని క్లైమాక్స్ రేంజ్ లోకి తీసుకెళ్లిన దర్శకుడు కథలో లీనమవుతున్న కాసేపట్లోనే కాస్త ఇబ్బందికి గురి చేసినట్లు ఉంటుంది. ఎన్టీఆర్ ని పవర్ ఫుల్ క్యారెక్టర్ లో చూపించిన దర్శకుడు కథలో జాగ్రత్తలు తీసుకోలేకపోయాడు. ఇలాంటి కథలతో వచ్చిన సినిమాలు టాలీవుడ్ లో కోకొల్లలు. ప్రతి మగాడి జీవితం మార్పు లో స్త్రీ ది ముఖ్యమైన పాత్ర అనే కాన్సెప్టుతో వచ్చినా… అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పటి వరకు దర్శకుడు త్రివిక్రమ్ తన సినిమా ల్లో తన డైలాగ్ పంచ్ లతో ఆడియన్స్ ను మెప్పించిన విషయం తెలిసిందే. ఆజ్ఞతవాసి సినిమా నుంచి తన డైలాగ్ ఫ్లేవర్ తగ్గిందనే చెప్పాలి. నవీన్ చంద్ర విలన్ గా ఆకట్టుకున్నాడు. ఫైనల్ గా ఎన్టీఆర్ మానియా.. అరవింద సమేత…

రేటింగ్: 3.5/5

ఆనంద్ తాళ్లూరి, సినిమా డెస్క్.