గీత గోవిందం రివ్యూ

టైటిల్ : గీత గోవిందం
జానర్ : రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌
తారాగణం : విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న, సుబ్బరాజు, రాహుల్‌ రామకృష్ణ, అభి
సంగీతం : గోపి సుందర్‌
దర్శకత్వం : పరశురామ్‌
నిర్మాత : బన్నీ వాస్‌


విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి తో మాస్ హీరోగా ఓవర్ నైట్ హీరో గా ఎదిగిపోయాడు. మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ మరో డిఫరెంట్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫుల్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా తన ఇమేజ్ కి పూర్తిగా డిఫరెంట్ గా చేసాడు విజయ్ దేవరకొండ. మరి ఈ సినిమాతో ప్రేక్షకుల స్థాయిని ఆకట్టుకున్నాడా.. లేదా అనేది చూడాలంటే ఈ గీత గోవిందుల ప్రేమాయణం వెండితెర మీద చూడాల్సిందే..

కథ:

విజయ్ గోవింద్ (విజయ్ దేవరకొండ ) ఓ కాలేజ్ లో లెక్చరర్ గా పనిచేస్తుంటాడు. తాను పెళ్ళిచేసుకుని అమ్మాయి ని అమ్మలా చూసుకోవాలనుకుంటాడు. అదే సమయంలో గీత (రష్మిక మండన్న) ని గుడిలో చూసి తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. గోవింద్ తన చెల్లి పెళ్లి కోసం ఊరికి బయలుదేరుతాడు. అదే బస్సులో గీత కూడా ప్రయాణం చేస్తుంది. ఇదే బస్సులో గోవింద్ చేసిన ఓ పొరపాటు వాళ్ళ గీత గోవింద్ ని అసహ్యించుకుంటుంది. ఈ సంఘటనను గీత అన్న ఫణింద్ర (సుబ్బురాజు)కు విషయం చెబుతుంది. విజయ్ ని చంపేందుకు ఫణింద్ర బయలుదేరుతాడు. అలా గీత నుంచి తప్పించుకున్న విజయ్ గోవింద్ ఎలా బయట పడ్డాడు. ఇంతకీ బస్సులో జరిగిన సంఘటన ఏంటి.. ఫణింద్ర విజయ్ ని చంపాడా.. విజయ్ చేసిన తప్పును గీత క్షయమించిందా.. ఇంతకీ ఏం జరిగింది.. అనేది సస్పెన్స్…

 

నటీనటుల పనితీరు:

కాలేజ్ ప్రొఫెసర్ గా విజయ్ దేవరకొండ తన భుజాలపై వేసుకుని నడిపించాడు. తన అద్భుతమైన నటనతో మెప్పించాడు. అటు ప్రొఫెసర్ గా, లవర్ గా చాలా బాగా నటించాడు. అర్జున్ రెడ్డి తో మాస్‌ హీరో గా మెప్పించిన విజయ్ దేవరకొండ తొలిసారిగా క్లాస్ అండ్ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ లో నటించాడు. తనదైన ఎనర్జిటిక్‌ పర్ఫామెన్స్‌, కామెడీ టైమింగ్‌తో మెప్పించాడు. నటన పరంగా సూపర్బ్ అనిపించడమే కాకుండా ఆకట్టుకున్నా లుక్స్‌ పరంగా కూడా వర్క్ అవుట్‌ చేసాడు. గీతగా రష్మిక ఒదిగిపోయింది. తన పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలో అందం, అభినయం తో కట్టిపడేసింది. చలో సినిమా తర్వాత రష్మిక ప్రాధాన్యం ఉన్న పాత్రలో మంచి నటన పరిణితి కనబరిచింది. తన పాత్రకు పూర్తి న్యాయ చేసింది. ఈ సినిమాలో నటనతో మరో మెట్టు ఎదిగిందని చెప్పొచ్చు. ఇక సుబ్బురాజు చాలా కాలం తరువాత మంచి పాత్రతో ముందుకు వచ్చాడు. ఒకవైపు.. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో కనపడుతూనే.. సాఫ్ట్ క్యారేక్టర్ ని చూపించాడు. గీతకు అన్నగా చాలా బాగా నటించాడు. హీరో ఫ్రెండ్ పాత్రల్లో రామకృష్ణ, అభి కామెడీ తో కడుపుబ్బా నవ్వించారు. మరో కీలక పాత్రలో వెన్నెల కోశోర్ తనదైన స్టైల్ కామెడీని పండించాడు. హీరో తండ్రిగా నాగబాబు బాగానే నటించాడు. మిగతా పాత్రల్లో అన్నపూర్ణమ్మ, చలపతి రావు తదితరులు పర్వాలేదనిపించారు.
సాంకేతిక వర్గ పనితీరు:
దర్శకుడు పరశురామ్ కథనం, డైలాగ్స్‌తో ఆడియన్స్‌కు కొత్త అనుభూతిని అందించాడు. పరశురామ్ సినిమా అంటే యూత్‌ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌లో ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంటుంది. ఆంజనేయులు, సోలో, శ్రీరస్తు శుభమస్తు లాంటి సినిమాలతో ఆకట్టుకున్న పరశురామ్ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసాడు. అందుకే కాస్త గ్యాప్‌ తీసుకొని ఓ ఫ్యామిలీ, రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు మరో మేజర్‌ ప్లస్‌ పాయింట్ గోపిసుందర్‌ సంగీతం. కథలో భాగంగా వచ్చిపోయే పాటలు ఆడియన్‌ను మరింతగా క్యారెక్టర్స్‌తో కనెక్ట్ చేసేస్తాయి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు ఇలా అన్ని సినిమా స్థాయికి తగ్గట్టుగా సరిగ్గా కుదిరాయి.
విశ్లేషణ:
పరశురామ్ అనుకున్న స్థాయి కంటే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. తన హిట్‌ చిత్రాల స్థాయిలో లవ్ అండ్ కామెడీ, ఎమోషన్స్‌ను పండించడంలో సక్సెస్ అయ్యాడు. చాలా చోట్ల పరశురామ్ గత చిత్రాల ఛాయలు కనిపించకుండా చాలా జాగ్రత్త పడ్డాడు.. తెర మీద విజయ్ ని చాలా హ్యాండ్సమ్ గా చూపించాడు. అంతేకాదు గత చిత్రాలతో పోలిస్తే విజయ్ ఈ సినిమాలో మంచి నటనను కనబరిచాడు. హీరోయిన్‌ గీత పాత్రలో రష్మిక ఒదిగిపోయింది. తనకున్న హోమ్లీ ఇమేజ్‌తో మెప్పించింది.

 

రేటింగ్ : 4/5

                                                                                                                 ఆనంద్ తాళ్లూరి, సినిమా డెస్క్