పెళ్లికూతురు అవుతోన్న హోమ్లీ హీరోయిన్!

nikitha
హాయ్‌ చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ నిఖిత. డాన్‌, సంబరం, కళ్యాణ రాముడు, వంటి సినిమాల్లో చేసినా సరైన గుర్తింపు మాత్రం రాలేదు. సరైన అవకాశాలు లేక కొద్ది కాలం చిన్న చిన్న పాత్రలు వేసిన ఈ అమ్మడు ఇప్పుడు పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. ముంబయికి చెందిన వ్యాపారవేత్త గగన్‌దీప్‌ సింగ్‌ మగోతో నిఖిత వివాహం ఫిక్స్ అయ్యింది. ఈ విషయం స్వయంగా నిఖిత తెలిపింది. ఈ దసరాకి తన పెళ్లి జరగనుందని, వివాహ వేడుక శుక్రవారం నుండి ప్రారంభం అవుతుందని పేర్కొంది. నిఖిత పెళ్లి చేసుకోనున్న వ్యక్తి వ్యాపారవేత్త మహీందర్‌ సింగ్‌ మగో కుమారుడు. గత ఏడాది డిసెంబర్ లో ఓ కజిన్‌ వివాహంలో గగన్‌ని తొలిసారి కలిశానని చెప్పింది. అప్పుడే తనను ఇష్టపడి ప్రపోజ్ చేశారని తెలిపింది. హోమ్లీగా ఉండటం వల్లే ప్రేమించి పెళ్లికి ఒప్పించాడని అంది నిఖిత. ముంబయి రెస్టారెంట్‌లో మోకాలిపై నిలబడి డైమెండ్‌ రింగ్‌తో నాకు తన ప్రపోజ్‌ చేశాడు’ అని నిఖిత చెప్పింది.