సవ్యసాచి రివ్యూ

సవ్యసాచి రివ్యూ

నటీనటులు:- నాగ చైతన్య, నిధి అగర్వాల్, ఆర్. మాధవన్, భూమిక, వెన్నెల కిషోర్, రావు రమేష్ తదితరులు.

దర్శకుడు:– చందూ మొండేటి.

సంగీత దర్శకుడు:- M.M. కీరవాణి.

నిర్మాత:- న‌వీన్ యేర్నేని, వై ర‌విశంక‌ర్, మోహ‌న్ చెర‌ుకూరి.

సినిమాటోగ్రఫీ:- J. యువరరాజ్.

ఎడిటర్:- వెంకటేశ్వరరావు కోటగిరి.

 

   నాగచైతన్య హీరోగా ఒక కొత్త యాంగిల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సినిమా సవ్యసాచి. టీజర్, ట్రైలర్ మరియు పాటలతో ఆకట్టుకున్న అసవ్యసాచి సినిమా ఒక ప్రయోగాత్మక మూవీ గా కొత్త కాన్సెప్ట్ తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అయితే మంచి అంచనాలు ఉన్న సవ్యసాచి సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది, ఈ సినిమా ఏవిధంగా ఆడియన్స్ ని ఆకట్టుకుందో ఇప్పుడు చూదాం…

కథ:-

   విక్రమ, ఆదిత్య్ (నాగ చైతన్య) వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ కారణంగా.. ఒక బాడీలోనే ఇద్దరు కలిసి పుడతారు. విక్రమ్ ఆదిత్యకు తన అక్క భూమిక కూతురు మహాలక్ష్మి అంటే ప్రాణం. ఆ పాపలో చనిపోయిన తన తల్లిని చూసుకుంటుంటాడు. ఈ క్రమంలో విక్రమ్, తన లవర్ చిత్ర (నిధి అగర్వాల్) మళ్ళీ ఆరు సంవత్సరాల తరువాత కలుసుకుంటారు. ఇలా అంత హ్యాపీగా జరిగిపోతున్న క్రమంలో విక్రమ్ మేనకోడలు (భూమిక కూతురు) కిడ్నాప్ కి గురి అవుతుంది. అసలు ఆ కిడ్నాప్ చేసింది ఎవరు ? అరుణ్ (మాధవన్)కి ఆ కిడ్నాప్ కి ఏమైనా సంబంధం ఉందా ? ఒకవేళ అరుణే ఆ కిడ్నాప్ చేసి ఉంటే.. ఎందుకు చేసి ఉంటాడు ? ఇంతకీ అరుణ్ కి, విక్రమ్ ఆదిత్య కు మధ్య వైరం ఏమిటి ? అరుణ్ ఎందుకు ఇవ్వన్నీ చేస్తున్నాడు ? చివరకి విక్రమ్, అరుణ్ నుండి తన మేనకోడలని కాపాడుకున్నాడా ? లేదా ? లాంటి విషయాలు తెలయాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:-

   విక్రమ్ ఆదిత్య పాత్రలో చాల ఆసక్తి కలిగించేలా నటిస్తూ అందరిని ఆకట్టుకుని మెప్పించాడు చైతు.అలాగే చైతన్య ఒకరిలో ఇద్దరిలా చక్కని నటనను కనబరిచాడు. ఇక విలన్ రోల్ లో మాధవన్ చాలా బాగా నటించాడు. అలాగే కొత్త యాంగిల్ లో అందరిని అలరించాడు. ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్ నిధి అగర్వాల్ చాల తక్కువగా కనిపించిన తన పాత్రలో బాగానే నటించింది. అయితే మిగిలిన పాత్రల్లో నటించిన భుమిక , వెన్నెల కిషోర్, ఎన్.ఆర్.ఐ గా శకలకా శంకర్, తదితరులు వాళ్ళ పాతరాల్లో చాలా బాగా నటించి ఆడియన్స్ ని మెప్పించారు.

సాంకేతిక విభాగం:-

  మంచి స్టోరీ లైన్ తీసుకుని కథను బాగా నడిపించాడు డైరెక్టర్ చందూ మొండేటి. అయితే కథను బాగా చూపించడం లో దర్శకుడి పనితనం కనబడుతున్నది. ఇక ఈ సినిమా లో వ్యూజువల్స్ కొన్ని సెన్స్ అందరిని కట్టి పడేశాయి. కాగా ఈ సినిమాలో క్లైమాక్స్ దృశ్యాలు ఈ సినిమాకే హైలెట్ గా నిలిచాయి. ఇక MM కీరవాణి
అందించిన సంగీతం అందరిని ఆకట్టుకుంటుంది. కాగా ఈ సినిమాలో J. యువరరాజ్. ఫొటోగ్రఫీ చాలా బాగుంది. అలాగే రామ్-లక్ష్మణ్ అందించిన ఫైట్స్ చాలా బాగుండగా, ఈ సినిమాలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి.

విశ్లేషణ :-

  సవ్యసాచి సినిమా ఒక యాక్షన్ డ్రామాగా… ఫామిలీ కథలకు దగ్గరగా అందరిని అలరించే విధంగా ఉంది. ఈ సినిమాలో నటించిన నాగచైతన్య హీరోగా, మాధవన్ విలన్ గా చాలా బాగా నటించారు. ఇక మిగిలిన నటులు కూడా తమ తమ నటనలతో ఆకట్టుకున్నారు. ఇకపోతే అటు సాంకేతిక బృందం కూడా వాళ్ళ పని తనాన్ని చూపించారు. మొత్తానికి ఈ సినిమాతో చైతన్య మంచి హిట్ కొట్టాడని చెప్పవచు.

రేటింగ్ :- 3.0