అల్లు అర్జున్ ను చుట్టుముట్టిన పవన్ ఫ్యాన్స్

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం.150 ప్రీ రిలీజ్ వేడకలో నాగబాబు వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగుతోంది. మరో వైపు వేడుకలో చిరు కూడా పవన్ అభిమాని వల్ల కాస్త ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. అయితే స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్‌ కూడా పవన్ ఫ్యాన్స్ వల్ల ఇబ్బంది పడ్డాడట. ఖైదీ నెం.150 ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు వచ్చిన బన్నీ కారు దిగి వేదికవైపు వెళ్తుండగా పవన్ అభిమానులు చుట్టుముట్టి పవర్‌స్టార్… పవర్‌స్టార్ అంటూ నినాదాలు చేశారు. అయితే అల్లు అర్జున్ వారు ఎంతగా నినాదాలు చేసినా నవ్వుతూ అలానే ఉన్నాడు. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకోవడంతో బన్నీ వేదిక వద్దకు వెళ్లగలిగాడు. అయితే ఈ సారి కూడా అల్లు అర్లున్ పవన్ పేరు మాత్రం చెప్పలేదు. 
 
గతంలో ‘చెప్పను బ్రదర్’ అంటూ పవన్ కళ్యాణ్ గురించి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సరైనోడు, ఒక మనసు వేడుకలోనూ అల్లు అర్జున్ ను పవన్ ఫ్యాన్స్ ఇబ్బంది పెట్టారు. ఇక చెప్పను బ్రదర్ అంటూ తాను ఎందుకు అనాల్సి వచ్చిందో కూడా అప్పుడే బన్నీ వివరణ కూడా ఇచ్చాడు. కానీ అభిమానులు మాత్రం మరోసారి అదే తీరుతో బన్నీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు.