మూడు సినిమాలను ఓకే చేసిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి దాదాపు పదేళ్ల తర్వాత ఖైదీ నెం.150 సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. సంక్రాంతి కానుకగా అభిమానుల కోసం ఖైదీ జనవరి 11న విడుదల కానుంది. ఇక దీని తర్వాత మరో మూడు సినిమాలు చేసేందుకు కూడా చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘ఖైదీ నెంబర్ 150’కి పని చేసిన పరుచూరి బ్రదర్స్ మరో సారి చిరంజీవి కోసం ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ని సిద్ధం చేస్తున్నారు. స్క్రిప్ట్ పూర్తయ్యాక ఆ వివరాలు బైటికి చెప్పనున్నారని సమాచారం. దీనితో పాటే  దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా చిరంజీవి కోసం ఒక స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట. ఇదిలా ఉంటే.. తన 152 వ సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీత ఆర్ట్స్ బ్యానర్‌లో చేయనున్నట్టు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఓ ఇంటర్వూలో చెప్పారు. ఇప్పటికే చిరు తర్వాతి సినిమా తన బేనర్ పైనే చేస్తారని స్పష్టం చేయడంతో మరి ఆ సినిమా ఎవరి దర్శకత్వంలో ఎలా ఉండబోతుందనే దానిపై సస్పెన్స్ ఉంది. మొత్తంగా మెగాస్టార్ రీ ఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు.