డబ్బుకోసమే అవి చేస్తున్నా: సన్నీలియోన్

పోర్న్ ఇండస్ట్రీ నుండి బాలీవుడ్‌‍కు వచ్చి హీరోయిన్‌గా మారిన బ్యూటీ సన్నీలియోన్. అడల్ట్ సినిమాలతో పాటు ప్రత్యేక గీతాలతోనూ అలరిస్తోన్న సన్నీ బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్  ‘రాయీస్‌’లో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. షారుఖ్ ఖాన్ తో ఓ సాంగ్ అయినా సరే చేయడం తన అదృష్టం అంటూ సన్నీ ఆనందం వెలిబుచ్చింది. బాలీవుడ్ కు వచ్చినప్పటి నుండి షారుఖ్ తో చేయాలని తాను కన్న కలలు ఇంత త్వరగా నిజమవుతాయని అనుకోలేదని, ఆయనతో షూటింగ్ చేస్తున్నంత సేపు ఎంతో ఉద్విగ్నతతకు గురయ్యానని అంది. తాను పడ్డ కష్టానికి ఫలితం దక్కుతోందని అన్న సన్నీ పోర్న్ స్టార్ గా తాను ఎదుర్కొన్న అవమానాలను కూడా గుర్తు చేసుకుంది. 
 
తన వీడియోలు చూడమని ఎవరినీ కోరలేదని, హీరోయిన్లుగా చలామణీ అవుతూ ఎలాంటి వస్త్రాలు ధరించినా ఏమీ అనని వాళ్లు తనని మాత్రం చిన్న చూపు చూస్తున్నారని అంది. తాను పోర్న్ వీడియోలు చేయడం ఎప్పుడో మానేసినా ఇప్పటికీ అలానే చూస్తున్నారని వాపోయింది. ఇక కేవలం డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నారా అంటే.. డబ్బు ఇస్తేనే సినిమా చేస్తా, లేకుంటో చేయను, అంటూ సన్నీ సూటిగా మాట్లాడుతోంది.