చైతు నిశ్చితార్థం రోజే మరో ముహూర్థం?

naga_chaitanya_engagement
అక్కినేని నాగచైతన్య, సమంతల నిశ్చితార్థం ఈ నెల 29న జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే అదే రోజు ఎంగేజ్ మెంట్ తో పాటు మరో ముహూర్తం కూడా ఖరారైందట. చైనత్య మేనమామ దగ్గుబాటి సురేష్‌బాబు కోరిక మేరకు.. చైతూ వారి బేనర్‌లో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.  
 
కృష్ణ అనే ఓ కొత్త దర్శకుడితో చైతూ హీరోగా దగ్గుబాటి రానా ఓ సినిమా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. 
 
చైతూ, సమంతల నిశ్చితార్థం రోజు అంటే.. జనవరి 29వ తేదీనే కొత్త సినిమాకు కూడా ముహూర్తం ఫిక్స్ చేశారని ఫిల్మ్ నగర్ జనాలు అంటున్నారు. దీంతో చైతన్య రెండు కోరికలు ఒకేసారి తీరుతున్నాయని సంతోషంలో మునిగిపోయారట. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.