రివ్యూ: నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్

nenu_nanna_review

నటీనటులు : హెబ్బా పటేల్, నోయల్, అశ్విన్, నూకరాజు
సంగీతం : శేఖర్ చంద్ర
డైరెక్టర్ : భాస్కర్ బండి
నిర్మాత : బెక్కం వేణుగోపాల్
రిలీజ్ డేట్ : 16 డిసెంబర్, 2016.

‘కుమారి 21ఎఫ్‌’తో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న బ్యూటీ హెబ్బాపటేల్. ఇటీవలే ఎక్కడికి పోతావు చిన్నవాడతో మరో హిట్ అందుకుంది. తాజాగా హెబ్బా భాస్కర్ బండి దర్శకత్వంతో ‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌’ చిత్రం చేసింది. టైటిల్‌తో విడుదలకు ముందే మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్రంలో హెబ్బా బాయ్‌ ఫ్రెండ్స్‌గా నోయల్, అశ్విన్, కేరింత నూకరాజు కనిపించనున్నారు. మరి భారీ అంచనాల మధ్య ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉందో ఓ లుక్కేద్దాం.

కథ..
సరదగా ఆడుతూ పాడుతూ గడిపే అమ్మాయిలు హెబ్బా పటేల్, తేజశ్వీ మాదివాడ. సరదాగా లైఫ్ ని ఎంజాయ్ చేయడం కోసం బాయ్ ఫ్రెండ్ వేటలో పడతారు ఈ ఇద్దరూ. అలాంటి టైంలోనే ఎన్ కౌంటర్ పార్వతీశం, నోయెల్, అశ్విన్ బాబు వీరి జీవితంలోకి వస్తారు. ఆ ముగ్గురితో స్నేహం చేసిన హెబ్బా వారితో సరదాగా తిరిగుతుంది. అయితే చివరికి వారిలో ఎవరిని తన జీవిత భాగస్వామిగా సెలక్ట్ చేసుకోవాలో అర్థం కాక డైలమాలో పడుతుంది. తన సమస్యను నేరుగా తన తండ్రి రావు రమేష్ దగ్గరికి తీసుకెళ్తుంది. తన కూతురిచ్చిన షాక్ కు రావు రమేష్ ఏం చేశాడు. హెబ్బా ఆ ముగ్గురిలో ఎవరిని పెళ్లి చేసుకుంది, ఆ ముగ్గురు భాయ్ ఫ్రెండ్స్ కథ ఏంటి అన్నది మిగిలిన స్టోరి.

సినిమాకు హైలెట్స్..
కుమారి 21 ఎఫ్ తర్వాత మరోసారి హెబ్బా అలాంటి సరదా పాత్రనే చేసినా.. ఇందులో తన పేరెంట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత నిచ్చే యువతిగా కనిపిస్తుంది. కేవలం గ్లామర్ షో కాకుండా నటనతో కూడా ఆకట్టుకుంది. సపోర్టింగ్ క్యారెక్టర్‌గా తేజశ్వీ మెప్పించింది. ఫస్ట్ హాఫ్ లో ఇద్దరు హీరోయిన్ల గ్లామర్ షో సినిమాకు బాగా కలిసొచ్చింది. భాయ్ ఫ్రెండ్స్ ‌ని సెలక్ట్ చేసుకునే క్రమంలో వచ్చే కామెడీ సీన్స్ బాగున్నాయి.

హెబ్బా భాయ్ ఫ్రెండ్స్‌గా పార్వతీశం, నోయెల్ సేన్, అశ్విన్ బాబు భిన్నమైన పాత్రలు చేశారు. తమ క్యారెక్టర్లలో ఒదిగి పోయారు. ముఖ్యంగా కూతురి ప్రేమ వ్వవహారంతో షాక్ అయిన తండ్రిగా రావు రమేష్ రియాక్షన్, ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాల నేపథ్యంలో రావు రమేష్ నటుడిగా మెప్పించారు. మిగిలిన వారంతా తమ తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు. ప్రస్తుతం యువతీ యువకుల తీరు, వారితో తల్లితండ్రుల ఎమోషన్స్ చాలా బాగా తెరకెక్కించారు దర్శకుడు.

నెగెటివ్ పాయింట్స్..
స్టోరీ చెప్పే విధానంలో క్లారిటీ మిస్సయ్యింది. ప్రతి ఒక్కరికీ వారి వారి పరిధిలో సమస్యలు ఉంటాయి, వారిలో నువ్వు ఎవరితో సంతోషంగా ఉండగలవో వారిని సెలక్ట్ చేసుకోవాలని అనే థీమ్‌ని సరిగా చూపించలేకపోయారు. ఎడిటింగ్ విషయంలో ఇంకొంచెం శ్రద్ధ పెట్టింటే బాగుండేది.

రిజల్ట్…
కూతురిని ప్రేమించే ప్రతి తండ్రి, తండ్రిని గౌరవించే ప్రతి కూతురు చూడాల్సిన సినిమా. ఎమోషనల్, కామెడీ ఎంటర్‌టైనర్.

రేటింగ్: 3/5