ఎన్టీఆర్ సినిమాపై నవదీప్ కామెంట్స్

జై సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన యంగ్ హీరో నవదీప్. హీరోగా నవదీప్ చేసిన సినిమాలు అతని కెరీర్ కు పెద్దగా కలిసి రాలేదు. దీంతో నవదీప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు కూడా చేస్తున్నాడు. తాజాగా ఈ నటుడు ధృవ సినిమాలో  హీరోకు సపోర్టింగ్ క్యారెక్టర్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సందర్భంగా నవదీప్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆర్య-2లో నెగెటివ్ షేడ్‌లో చేసి అనంతరం బాద్‌షాలో విలన్‌గా కనిపించాడు. అయితే బాద్‌షా సినిమాలో విలన్‌గా చేసి ఉండాల్సింది కాదని నవదీప్ ఇప్పుడు వ్యాఖ్యానించడం ఆసక్తిరేపుతోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన బాద్ షా సినిమా తన కెరీర్ కు ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటే.. సినిమా చూశాక అనవసరంగా చేశానేమో అనిపించదని అన్నాడు నవదీప్. బాద్ షా లో ఆ పాత్రకు బదులు ఆర్య-2లో చేసినట్లు నెగెటివ్ టచ్ పాత్రల వరకు చేస్తేనే బాగుంటుందనిపించిందని వెల్లడించాడు. అయితే అప్పుడెప్పుడో సినిమా గురించి ఇప్పుడు నవదీప్ చెప్పడానికి కారణం ఆ సినిమా హిట్ కాకపోవడమే నేమో అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.